Thursday, July 18, 2013

వాల్మీకి రామాయణం చెప్పాడా, రాశాడా?

వాల్మీకి రామాయణం చెప్పాడా, రాశాడా?

ఈ సందేహం ఈ రోజున చాలామందికి రాదు. ఎందుకంటే మనం రాతకు అలవాటుపడిపోయాం కనుక వాల్మీకి రామాయణం రాశాడనే అనుకుంటాం.

కానీ నిజానికి వాల్మీకి రామాయణం చెప్పాడు’, లేదా చేశాడు’. శిష్యులు ఆయన చెప్పిన శ్లోకాన్ని రాసుకోలేదు, కంఠస్థం చేశారు. రామాయణం చెప్పడం పూర్తి అయిన తర్వాత దీనిని ఎవరు కంఠస్థం చేసి గానం చేస్తారనే వాల్మీకి అనుకున్నాడు. కుశలవులు దానిని కంఠస్థం చేసి గానం చేయడం ప్రారంభించారు. విచిత్రం ఏమిటంటే, నేను చూసిన రామాయణ ప్రతిలో తెలుగు తాత్పర్యం కూర్చిన పండితుడు, వాల్మీకి రామాయణం చెప్పాడు, చేశాడు అని ఉన్న ప్రతిచోటా రచించాడు అనే మాట ఉపయోగించారు! 

భారతీయులు, గ్రీకులు, ఆఫ్రికన్లు అనే తేడా లేకుండా ప్రాచీన కవి, కథకులందరూ కవిత్వం లేదా కథ చెప్పారు, రాయలేదు. తమ కవిత్వం తంత్రీలయబద్ధంగా ఉండాలనుకున్నారు. తాము చెప్పే కథలకు, వీరగాథలకు, వంశచరిత్రలకు తంత్రీలయ నేపథ్యం ఉండేలా చూసుకున్నారు.  

ఇంతకీ విషయమేమిటంటే, కుంటా కింటే వంశచరిత్రను చెప్పే గాథికుని గుర్తించి హేలీకి తెలియజేసిన గాంబియా మిత్రులు ఒక హెచ్చరిక కూడా చేశారు: సంగీత నేపథ్యం లేకుండా గాథికులు నోరు విప్పరట! దాంతో హేలీ ఆ ఆఫ్రికన్ వాల్మీకిని కలుసుకోడానికి ముగ్గురు దుబాషీలు, నలుగురు సంగీతకారులతో సహా పద్నాలుగు మందిని వెంటబెట్టుకుని వెళ్ళాడు.

(పూర్తి వ్యాసం http://www.saarangabooks.com/magazine/ లో నేను రాస్తున్న 'పురా'గమనం అనే కాలమ్ లో చదవండి)

2 comments:

  1. చెప్పాడా, రాశాడా? !!
    దయచేసి వాల్మీకులవారిని వాడూ వీడూ అంటూ ఏకవచన ప్రయోగం చేయకండి. ఉచితం కాదు. మహర్షులను గౌరవబహువచనంలో సంబోధించటం సముదాచారం.

    విశేషం ఒక్క భగవంతుని విషయంలోనే. ఆత్మీయతా సూచకంగా తాదాత్మ్యంతో భక్తులు ఏకవచన ప్రయోగం చేస్తారు. అది సముచితమే, సంప్రదాయమే.

    ReplyDelete
    Replies
    1. ఆత్మీయ సంబోధనగానే తీసుకోండి శ్యామలరావుగారూ, పూర్వకవులను అందరినీ అలాగే సంబోధిస్తాం. దానిని వాడు, వీడు అనడంగా మీరు అన్వయించడం ఉచితం కాదు. వాల్మీకి అంతటివాడిని వాడు వీడు అనే కుసంస్కారం నా వ్యాసంలో ఎక్కడైనా కనిపించిందా?

      Delete